తుది జట్టుపై.. ‘నో లీక్స్’

by Shyam |
తుది జట్టుపై.. ‘నో లీక్స్’
X

ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మనసంతా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌(ఎంసీజీ) చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగేది ఈ మైదానంలోనే. తొలిసారి ఫైనల్స్ చేరిన టీమ్ ఇండియా, ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియాలు తుది పోరులో తలపడనున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ జరుగుతుండటం మరింత ఆసక్తిని రేపుతోంది.

కాగా.. రేపటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత అమెరికన్ పాప్ సింగర్ ‘కేటి పెర్రీ’ తన పాటలతో అలరించనుంది. శనివారం ఎంసీజీకి వచ్చిన పెర్రీ భారత మహిళా జట్టుతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా.. రేపటి మ్యాచ్‌కు తుది జట్టులో ఉండే ఆటగాళ్లు ఎవరని పెర్రీ భారత ఆటగాళ్లను ప్రశ్నించింది. దీనికి వేద కృష్ణమూర్తి ‘మేం అలా చెప్పకూడదు.. నిబంధనలు ఒప్పుకోవు’ అని సమాధానం ఇచ్చింది. అయితే అక్కడే ఉన్న జెమీమా రోడ్రిగ్స్ మాత్రం.. నేను కచ్చితంగా మీకు చెప్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, రేపు మీరు పాటపాడే సమయంలో నన్ను పిలవండి, మీకు తుది జట్టు సభ్యుల పేర్లు చెబుతాననగానే అందరూ పగలబడి నవ్వారు.

ఈ సంఘటనను ఐసీసీ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతే కాదు.. ‘కనీసం కేట్ పెర్రీకి కూడా ఆ విషయం చెప్పరంటా’ అని క్యాప్షన్ ఇచ్చింది.

Tags: ICC, Ind vs Aus, MCG, Final Team, Pop singer Katy Perri

Advertisement

Next Story