- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాచ్ ధర రూ.5 కోట్లు కాదు.. ‘హార్దిక్ పాండ్యా’ క్లారిటీపై విపరీతమైన ట్రోల్స్
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా అల్ రౌండర్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచి హాట్‌టాపిక్‌గా మారాడు. ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తన వాచ్‌లను సీజ్ చేసిన విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు హార్దిక్ పాండ్యా.. అయితే, పాండ్యా ఇచ్చిన వివరణపై నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. తాను దుబాయ్ నుంచి నవంబర్ 15న ముంబాయి విమానాశ్రయనికి వచ్చారన్నారు. నా లగేజీని కస్టమ్స్ అధికారుల కౌంటర్ దగ్గరకు నేనే స్వచ్ఛందంగా తీసుకువెళ్లాను. వాళ్ళు నా లగేజ్‌ని చెక్ చేశారు. అందులో నేను కొన్న వాచ్ ఉంది.
దాని బిల్ చూపించాలని కస్టమ్స్ అధికారులు నన్ను అడిగారు. బిల్ నా దగ్గర లేదు. కానీ వాటిని నేను చట్టబద్ధంగానే కొనుగోలు చేసానని వివరించాను. ఆ బిల్ పత్రాలు త్వరలో అందజేస్తానని తెలిపాను. అందుకు నాకు కస్టమ్స్ అధికారులు సహకరించారు. వాచ్ ఖరీదు రూ.5 కోట్లు అని సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి ఆ వాచ్ ధర రూ.1.5 కోట్లు మాత్రమే అని వివరించాడు. నేను దేశ చట్టాలను గౌరవించే పౌరుడిని అని అన్నారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్‌కు నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. నాపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని చెప్పుకొచ్చారు. కాగా, హార్దిక్ ఇచ్చిన క్లారిటీపై కూడా నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.