బ్లాక్ డేగా ఉపాధ్యాయ దినోత్సవం..!

by Aamani |
బ్లాక్ డేగా ఉపాధ్యాయ దినోత్సవం..!
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా వ్యాప్తి దృష్టా పాఠశాలలు మూతపడి ప్రైవేట్ టీచర్ల ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ప్రైవేట్ టీచర్ల జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో ప్రైవేటు టీచర్లు బ్లాక్ డేగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రైవేటు టీచర్ల ఆకలి కేకలు, బాధల గురించి నిర్మల్ జిల్లా కలెక్టర్‎కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ప్రైవేటు టీచర్ల సంఘం అధ్యక్షులు రవీందర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి షేక్ అన్సర్ పాషా, పలువురు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్కూల్ యాజమాన్యాలు స్పందించి ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story