విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాష్టీకం

by srinivas |   ( Updated:2021-03-01 10:13:19.0  )
విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాష్టీకం
X

దిశ వెబ్ డెస్క్: విద్యార్థుల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు కఠినాత్ముడిగా మారాడు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గుడివాడ ఎస్.పి.ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలు విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన పీఈటీ ఉపాధ్యాయుడు మడక ప్రసాద్ కఠినంగా వ్యవహరించారు. స్కూలు ఆవరణలో మోకాళ్లపై విద్యార్థులను నడిపించారు. ఈ విషయాన్ని ఓ విద్యార్థి వీడియో తీయడంతో ఇది బయటపడింది. వీడియో చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పీఈటీ శారీరకంగా హింసిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మరోవైపు పీఈటీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story