ప్రకాశంలో కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్

by Sumithra |
ప్రకాశంలో కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్
X

విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న ఓ కీచక ఉపాధ్యాయుడు అరెస్టయ్యాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లిలోని పాఠశాలలో కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతుండేవాడు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story