‘సీఎం కనుసన్నల్లోనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ’

by srinivas |
‘సీఎం కనుసన్నల్లోనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ’
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిందని అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి జగనే అని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేకరణను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అని వెల్లడించారు. వైసీపీ మంత్రులకు అవగాహన లేదని, అసలు బొత్స సత్యనారాయణ తెలివి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు ముందు జగన్ ఒక బచ్చా అని ఎద్దేవా చేశారు. తమకు రాజీనామాలు చేయడం పెద్ద విషయం కాదని, స్టీల్‌ప్లాంట్ కోసం ఎంపీ ఏ రాజీనామా చేసినా మేం వారిపై పోటీ పెట్టం అని వైసీపీ ఎంపీలకు అచ్చెన్న సవాల్ విసిరారు. దీనికి ప్రభుత్వంలో ఉన్నవారే బాధ్యత వహించాలని సూచించారు.

Advertisement

Next Story