కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి

by Mahesh |   ( Updated:2021-05-01 21:41:34.0  )
కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా ఎంతో మంది నాయకులు, సినీ ప్రముఖులను బలి తీసుకుంది. అయితే తాజగా కరోనా కాటుకు టీడీపీ సీనియర్ నేత బలయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బొడ్డు భాస్కర రామారావు (72) ఆదివారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులుగా ఉండి పరిస్థతి విషమించడంతో ఆయన ఈ రోజు ఉదయం చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.

Advertisement

Next Story