- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోరంట్ల బుచ్చయ్య సంచలన ఆరోపణలు.. జగన్‌కు వాటిపై కన్నుపడింది
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఓ నియంత్రణ అనేది లేకపోవడంతో ఇష్టారీతిన అప్పులు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అప్పులుపాలవ్వడంతో తాజాగా సీఎం జగన్ కన్ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై పడిందన్నారు. అందువల్లే ఎన్టీఆర్ వర్సిటీ డబ్బును రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మళ్లించాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. కెనరా బ్యాంకులో దాచిన డబ్బును ప్రభుత్వం తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా యూనివర్సిటీల అభివృద్ధికి దాచిన సొమ్ముతో ప్రభుత్వం సోకులు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
Advertisement
Next Story