నోరు పారేసుకుంటే అధికారం రాదు: మాజీమంత్రి ఆనం

by srinivas |
నోరు పారేసుకుంటే అధికారం రాదు: మాజీమంత్రి ఆనం
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని హీనపక్షంగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ వెంకటగిరిలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారం కోసమే కుట్రలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీకి స్థానం లేదని, ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన పెట్టమనడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా చంద్రబాబూ? ’ అని ప్రశ్నించారు. టీడీపీ ప్రజాగ్రహానికి గురైందని.. అందుకే వారి దీక్ష పార్టీ కార్యాలయానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

‘నీ కొడుకు ఎలాగూ సీఎం కాలేకపోయాడు.. నీ స్నేహితుడి కొడుకు అయినందుకైనా సంతోషించాలి కదా అని అన్నారు. అలా సంతోషించకుండా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తారా అంటూ నిలదీశారు. 72 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబుకే రక్తం మరుగుతుంటే, యువనేత జగన్‌ను అసభ్యపదజాలంతో తిడితే ఇంకెలా ఉండాలని ప్రశ్నించారు. నోరు పారేసుకుంటే అధికారం రాదని టీడీపీ నేతలు గుర్తించాలని హితవు పలికారు.

Next Story

Most Viewed