జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులతో టీడీపీ నేతలు భేటీ

by srinivas |
tdp-leaders
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం ఏపీలో పర్యటించింది. మంగళవారం ఉదయం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఎస్సీ కమిషన్ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు.

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. అయితే వివరాలు విన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పూర్తిగా వింటామని సాయంత్రం 5.30 గంటలకు తమను కలవాలని అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో సాయంత్రం ఎస్సీ కమిషన్ సభ్యులను కలవనున్నట్లు మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యలు అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందాన్ని కలిసిన వారిలో వర్ల రామయ్య, నక్క ఆనంద్‌బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story