ట్విట్టర్ వీరుడు విజయసాయిరెడ్డి పెద్ద కమేడియన్: వర్ల

by srinivas |
ట్విట్టర్ వీరుడు విజయసాయిరెడ్డి పెద్ద కమేడియన్: వర్ల
X

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వీరుడిగా అభివర్ణించారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీలో విజయసాయిరెడ్డి పెద్ద కమేడియన్ అంటూ సెటైర్లు వేశారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన వర్ల రామయ్య.. “విజయసాయిరెడ్డీ గారు పెద్ద “ట్విట్టర్ వీరుడు”.ఆయన ట్వీట్లు అన్నీ అబద్దాలే. నమ్మశక్యం కానివి. లేకపోతే, రాష్ట్రంలో కరొనా విపరీతంగా పెరిగిపోతున్నదని అందోళన చెందుతుంటే, మన రాష్ట్రంలో కరొనా కట్టడి బాగాచేసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించినట్లు బాక ఊదుతారు. ఈ ప్రభుత్వానికీ పెద్ద విదూషకుడీయన” అని వ్యాఖ్యానించారు.

Tags: tdp, ysrcp, ap mp, vijayasaireddy, varla ramaiah, twitter

Advertisement

Next Story