మహేష్‌కు టీడీపీ నేత ధన్యవాదాలు

by srinivas |   ( Updated:2020-06-25 03:54:20.0  )
మహేష్‌కు టీడీపీ నేత ధన్యవాదాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకి టీడీపీ నేత వర్ల రామయ్య ధన్యవాదాలు తెలిపారు. వర్ల రామయ్య ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, ‘ఒక పేద బాలిక గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేసి ఆ చిన్నారి ప్రాణం కాపాడిన తెలుగు సినిమా హీరో మహేశ్ బాబుకు నా మనఃపూర్వక అభినందనలు. ఈ సాయం మీకు చిన్నది కావచ్చు. కానీ, ఆ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు తీరని మనోవేదనను తప్పించింది. మీకు, మీ కుటుంబానికి దేవుడు తోడుంటారు’ అని పేర్కొన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ భార్య నాగజ్యోతి పండంటి పాపకు జన్మనిచ్చింది. పుట్టుకతోనే ఆ చిన్నారికి అరుదైన గుండె సమస్య వచ్చిపడింది. చెడు, మంచి రక్తం కలిసిపోతోంది. దీంతో విషయం తెలుసుకున్న మహేష్ బాబు పాపకు విజయవాడలోని ఆంధ్రహాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించారు. దీనికైన ఖర్చు మొత్తాన్ని ఆయనే భరించారు. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై వర్ల ట్వీట్ చేశారు.

Advertisement

Next Story