వైసీపీ నేతలపై పట్టాభి కౌంటర్ అటాక్.. వదిలిపెట్టనంటూ వార్నింగ్

by srinivas |
వైసీపీ నేతలపై పట్టాభి కౌంటర్ అటాక్.. వదిలిపెట్టనంటూ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో నిరూపిస్తూ.. మీడియా ముందుకు వస్తే తనపై ఇప్పటికే మూడు సార్లు దాడులు చేశారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై కౌంటర్ అటాక్ చేశారు. వెనకడుగు వేసే ప్రస్తకే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ నాయకులకు తన మాటలతో అజీర్తి కలుగొచ్చని.. కానీ, పసుపు కార్యకర్తగా వారికి భయపడనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా ఎత్తి చూపుతానని.. ఎంత పెద్ద నాయకుడు అయినా వదిలిపెట్టనని హెచ్చరించారు. ఇక మీదట ప్రజల సొమ్మును దోచుకునే వారిని ఆధారాలతో సహా బయటపెడుతానంటూ పట్టాభి పేర్కొన్నారు. ఇందుకు పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క పసుపు సైనికుడికి హ్యాట్సాఫ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed