- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేయడమంటే.. రైతు మెడకు ఉరితాడు బిగించడమే
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తూ విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. రెండున్నరేళ్లలోనే రూ.9069 కోట్లు విద్యుత్ ఛార్జీల భారం మోపినట్లు ఆరోపించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న జగన్ అధికారంలోకి వచ్చాక 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ఇప్పుడు ఐదోసారి పెంచేందుకు రెడీ అవుతున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గినా వినియోగదారులపై ఎందుకు ఛార్జీలు పెంచుతున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 24,491 కోట్లు అప్పు తెచ్చారని ధ్వజమెత్తారు.
అయినా రూ. 9069 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అది తన అవినీతికి, దుబారాకు జగనార్పణం చేసుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాణస్వీకారోత్సవ సభలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్..ఇప్పుడు రెట్టింపు భారం మోపుతున్నట్లు మండిపడ్డారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. ఇది రైతులకు ఉరితాడు బిగించడమే అవుతుందని కళా వెంకట్రావు విమర్శించారు. ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అందువల్లే ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు రావడం లేదని..ఫలితంగా నిరుద్యోగం మరింత పెరిగిందని మాజీమంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు.