- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర పన్నుల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కే: బుద్దా వెంకన్న
దిశ, ఏపీ బ్యూరో: మద్యం, ఇసుక, గనులు, గంజాయిపై వస్తున్న ఆదాయంతో పాటు ప్రజలపై వేస్తున్న పన్నుల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. దొంగ ఓట్లతో బద్వేలులో గెలిచారని, వైసీపీ నేతలు బాణాసంచా కాల్చడం కామెడీ సినిమాను తలపించిందని ఎద్దేవా చేశారు.
విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రజల్లో అభిమానం ఉంటే మూకుమ్మడి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు తనకు మరోసారి అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర నిర్వాహకులకు ఏ హాని జరిగినా అందుకు సీఎం జగనే బాధ్యులవుతారని పేర్కొన్నారు.