- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడి అరెస్ట్
చంద్రబాబు హయాంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణంలో నాటి కార్మిక మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించారు. అందులో కార్మిక శాఖలోని రూ.151కోట్ల ఈఎస్ఐ స్కాం వెలుగుచూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు రైట్ హ్యాండ్ అయిన నాటి మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో వెలువడింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారనీ.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలనీ అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో తేలింది. దీంతో అవినీతి జరిగిందని.. అందులో అచ్చెన్నాయుడు హస్తం ఉందని తేలడంతో ఆయనలో పాటు, ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.
2014-2019 మధ్య భారీ కుంభకోణం జరిగినట్టు తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.151కోట్లు చెల్లించినట్టు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరినీ బాధ్యులుగా గుర్తించారు. మందులు పరికరాల వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు విచారణలో తేలింది. తద్వారా అక్రమంగా రూ.85 కోట్లు చెల్లించినట్టు విచారణలో తేలింది. ఈ స్కామ్‌లో ఇప్పటికే ఒక డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. అతడు ఇచ్చిన ఆధారాల ప్రకారం అచ్చెన్నాయుడి బండారం బయటపడినట్టు సమాచారం. అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం టీడీపీ వర్గాల్లో కలవరపాటుకు గురిచేసింది.