ఏపీ భూముల అమ్మకంపై టీడీపీ విమర్శలు

by srinivas |
ఏపీ భూముల అమ్మకంపై టీడీపీ విమర్శలు
X

దిశ ఏపీ బ్యూరో: నవరత్నాలు, నాడు నేడు కార్యక్రమాల నిర్వహణ నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18.8 ఎకరాల భూములను 208.62 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్ముతున్నది భూములు కాదని, రాష్ట్రాన్నే అమ్ముకుంటున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే…

దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, ‘తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి ‘మిషన్ బిల్డ్ ఏపీ’ అని పేరు పెట్టారు. ఆ పేరుకు బదులు ‘జగన్ కిల్డ్ ఏపీ’ అని పేరు పెట్టుంటే బాగుండేది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మరో టీడీపీ నేత దేవినేని ఉమ దీనిపై స్పందిస్తూ, ‘విశాఖలో మీరు దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం సంపద సృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములని అమ్మేఅధికారం మీకు ఎవరు ఇచ్చారు? కోట్లు పెట్టి తెచ్చుకున్న మీ సలహాదారుల సలహాలు ఇవేనా? ఇది “బిల్డ్ ఏపీ” నా లేక “సెల్ ఏపీ”నా అని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి జగన్ గారు’ అని ప్రశ్నించారు. అలాగే..

‘అధికార మదంతో సామాన్యులని బెదిరించి గుడివాడలో భూములు లాక్కొంటున్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. కరోనా సమయాల్లో కూడా మట్టి, పేకాట, ఇసుక, లిక్కర్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. బూతులు తిట్టే మంత్రిని కట్టడిచేసి చర్యలు తీసుకునే ధైర్యం మీకు ఉందా జగన్ గారూ’ అని అడిగారు.

Advertisement

Next Story

Most Viewed