- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథ్ పారితోషికం రూ. 20.36 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) సీఈఎఓ, ఎండీ రాజేష్ గోపీనాథ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా రూ. 20.36 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆయన పారితోషికం రూ. 13.3 కోట్లు తీసుకున్నారు. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాజేష్ గోపీనాథ్ వేతన రూపంలో రూ. 1.27 కోట్లను, అలవెన్సుల రూపంలో రూ. 2.09 కోట్లను, కమీషన్ రూపంలో రూ. 17 కోట్లను అందుకున్నట్టు వివరించింది. అలాగే, టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా ఉన్న ఎన్ గణపతి సుబ్రమణీయం రూ. 16.1 కోట్ల పారతోషికం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది.
ఇందులో వేతన రూపంలో రూ. 1.21 కోట్లు కాగా, అలవెన్సుల రూపంలో రూ. 1.88 కోట్లు, కమీషన్ రూపంలో రూ. 13 కోట్లను అందుకున్నట్టు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఉన్నత స్థాయి అధికారుల పారితోషికం సగటున 55.22 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2020-21లో భారత్‌లోని కంపెనీల ఉద్యోగులు ఇతర అలవెన్సులతో కలిపి 6.4 శాతం, విదేశాల్లో ఉన్న వారి వేతనం 2-6 శాతం వరకు పెరిగినట్టు టీసీఎస్ నివేదిక తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీలో మొత్తం 4,48,649 మంది ఉద్యోగులున్నారని కంపెనీ పేర్కొంది. కాగా, భారత్‌లో సగటు వార్షిక వేతన పెంపు 5.2 శాతం.