- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం 100 శాతం
దిశ, వెబ్‌డెస్క్: సరైన సమయంలో వర్షాలు రావడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మద్దతుతో ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ దేశీయ డిమాండ్ పుంజుకుందని, దీంతో టాటా స్టీల్ ఉత్పత్తి స్థాయి (Tata Steel production level) 100 శాతానికి చేరుకుందని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీ.వి. నరేంద్రన్ తెలిపారు. తొలి త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఇప్పుడు ఎగుమతుల (Exports)పై తక్కువగా ఆధారపడి కొనసాగుతోందన్నారు.
భారత్‌లో కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ఉక్కు పరిశ్రమ (Steel industry) తీవ్రంగా ప్రభావానికి గురైంది. సరఫరా గొలుసు కూడా దారుణంగా దెబ్బతిన్నది. డిమాండ్‌తో పాటు ఉత్పత్తి కూడా కుంగింది. మార్కెట్ పరిణామాల (Market developments) కారణంగా..టాటా స్టీల్ ఉక్కు తయారీ కార్యకలాపాలు ఏప్రిల్‌లో 50 శాతం తగ్గించుకోవలసి వచ్చింది. ఉత్పత్తుల కోసం ఎగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, నెమ్మదిగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో దశలవారీగా ఉత్పత్తిని పెంచామని కంపెనీ తెలిపింది. టాటా స్టీల్ (Tata Steel) మొత్తం నిర్వహణ సామర్థ్యం ఏడాదికి 20.6 మిలియన్ టన్నులు. అయితే, 2020-21 ఆర్థిక త్రైమాసికం తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ ఇండియా (Tata Steel India) 2.99 మిలియన్ టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేయగా, అమ్మకాలు 2.92 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి.
అదేవిధంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మద్దతుతో రెండో త్రైమాసికంలో డిమాండ్ పునరుద్ధరణను చూస్తామని ఆశిస్తున్నట్టు నరేంద్రన్ తెలిపారు. ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ల డిమాండ్ కారణంగా ఆటో పరిశ్రమ రికవరీ బాగుందని నరేంద్రన్ చెప్పారు. కాగా, టాటా స్టీల్ సంస్థ గత రెండు త్రైమాసికాల్లో నష్టాలను నివేదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 4,648.13 కొట్ల నష్టాలను నమోదు చేసింది.
కంపెనీ వృద్ధి సాధించే అంశాల గురించి ప్రస్తావించిన నరేంద్రన్.. భారత్‌లో వ్యాపారం ఎప్పుడూ సానుకూలంగానే ఉందని, గత కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న సరఫరా వ్యవస్థ దృష్ట్యా భారత్‌లో టాటా స్టీల్ వ్యాపారం (Tata Steel Business) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉక్కు పరిశ్రమ (Steel industry)లో అత్యంత లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు నరేంద్రన్ చెప్పారు.