- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొబైల్‌ఫోన్ పరికరాల తయారీకి టాటా గ్రూప్ కొత్త ప్లాంట్!
దిశ, వెబ్‌డెస్క్: టాటా సన్స్ ఐఫోన్ విడి భాగాలను తయారు చేసేందుకు, అలాగే మొబైల్ ఫోన్, విడి పరికరాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు విదేశీ రుణాల ద్వారా 1 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ. 7,375 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. యాపిల్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పీఎల్ఐ(ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక) పథకం కింద టాటా గ్రూప్ ప్రయోజనాలు పొందాలని, తద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీకి కేంద్రంగా సంస్థను నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు టాటా సంస్థ 1.5 బిలియన్ డాలర్ల మూలధన వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇందులో బయట రుణాల ద్వారా 750 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు రుణాలను పొందాలని చూస్తోంది. మిగిలిన మొత్తాన్ని వివిధ మార్గాల ద్వారా సమీకరించాలని భావిస్తోంది. కొత్త ఉత్పత్తి యూనిట్ యాపిల్ అవసరాలను తీర్చగలదని భావిస్తున్నప్పటికీ, దక్షిణ కొరియా, జపాన్ నుంచి వచ్చే పరికరాల తయారీదారుల అవసరాలను కూడా తీర్చగలదని తెలుస్తోంది.