23 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యూటీ ఉత్పత్తుల రంగంలోకి టాటా గ్రూప్!

by Harish |
casmotics
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వ్యాపర సంస్థ టాటా గ్రూప్ త్వరలో బ్యూటీ ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా భారత్‌లోని బ్యూటీ ఉత్పత్తుల రంగం గణనీయంగా వృద్ధి సాధిస్తోంది. పలు నివేదికల ప్రకారం 2025 నాటికి దేశీయంగా ఈ రంగం మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ కంటే ఇది దాదాపు రెండు రెట్లు కావడం విశేషం. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల క్రితం ఈ వ్యాపారం నుంచి నిష్క్రమించిన టాటా గ్రూప్ మరోసారి ఈ రంగంలో సత్తా చాటాలని భావిస్తోంది.

ఇప్పటికే ఫుట్‌వేర్, లోదుస్తుల విభాంలో ట్రెంట్ కంపెనీని నిర్వహిస్తున్న టాటా సంస్థ ఇకపై బ్యూటీ ఉత్పత్తులు కూడా తమ కీలక వ్యాపార విభాగంగా పరిగణిస్తామని ట్రెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నోయల్ టాటా అన్నారు. 1953లో నోయల్ టాటా తల్లి సిమోన్ టాటా భారత్‌లో మొదటి కాస్మొటిక్ కంపెనీగా ‘లాక్మె’ను స్థాపించారు. ఆ తర్వాత దీన్ని 1998లో యూనిలీవర్ కంపెనీకి విక్రయించారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ 10 ఏళ్ల వరకు ఈ రంగంలోకి రాకూడదు. దీంతో ఆ సమయం తర్వాత టాటా సంస్థ 2014లో ట్రెంట్‌ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుమారు రూ. 750 కోట్ల విలువైన మార్కెట్‌ను కలిగిన సంస్థ విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

Next Story