- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటా మోటార్స్ నుంచి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు
దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబందించి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు, 2025 నాటికి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నట్టు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 76వ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశిస్తూ.. ‘2025 నాటికి టాటా మోటార్స్ 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు పెట్టుబడులు పెడతాము. అదనంగా, బ్యాటరీ సరఫరా కోసం టాటా గ్రూప్ భారత్, ఐరోపా ప్రాంతాల్లో సెల్, బ్యాటరీ తయారీలో భాగస్వామి కోసం అన్వేషిస్తోందని’ ఆయన వివరించారు. ఇ
ప్పటికే టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలతో సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో గత ఆర్థిక సంవత్సరం 2 శాతం వృద్ధి సాధించింది. రానున్న రోజుల్లో మరింత వృద్ధి సాధించగలమని ఆయన తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మార్పునకు టాటా మోటార్స్ కీలకపాత్ర వహిస్తుంది. కంపెనీ ఆటోమోటివ్ విభాగంలో గ్రీన్ మొబిలిటీకి టార్చ్ బేరర్‌గా ఉండనుంది. ఈ పరిణామాలు వాటాదారులకు వృద్ధి, రాబడిని అందిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇప్పటికే టాటా గ్రూప్ తన వ్యాపార నమూనాను మార్చే ప్రక్రియలో ఉంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు 2025 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారనున్నాయని ఆయన వెల్లడించారు.