- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ విభాగంలో 10,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని సాధించినట్టు శుక్రవారం వెల్లడించింది. దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టిగోర్ ఈవీ మోడల్‌తో ప్రవేశించిన టాటా మోటార్స్, ఆ తర్వాత 2020లో నెక్సాన్ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 70 శాతానికి పైగా మార్కెట్ వాటాతో టాటా మోటార్స్ ఈ ఏడాది ఆగష్టులో పటిష్టమైన ఆర్డర్లను సాధించి 10 వేల మైలురాయిని చేరుకున్న ఘనతను సాధించిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
మొదటి 10 వేల మార్కును అందుకుని ఈ విభాగంలో టాటా మోటార్స్ మెరుగైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించామని, దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు నిదర్శనమని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగానికి చెందిన శైలేష్ చంద్ర చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం 120 నగరాల్లో 700కి పైగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ప్రక్రియను టాటా పవర్ సంస్థ వేగవంతం చేస్తోంది.