మూడేళ్లలో రుణాలను సున్నాకు తగ్గిస్తాం

by Harish |
మూడేళ్లలో రుణాలను సున్నాకు తగ్గిస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: రుణాలను తగ్గించేందుకు, ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు టాటా మోటార్స్‌(TATA Moters) కంపెనీ ప్రాధాన్యతనిస్తుందని కంపెనీ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్(N. Chandrasekharan) అన్నారు. మంగళవారం జరిగిన 75వ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన, భవిష్యత్తులో ఉత్పత్తిని మెరుగు పరిచి, రుణాన్ని సున్నాకి తగ్గించడమే కంపెనీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం టాటా మోటార్స్ లిమిటెడ్ నికర రుణాలు రూ. 48వేల కోట్లుగా ఉన్నాయి. కంపెనీ వ్యాపారం గణనీయంగా నిర్వహిస్తున్నాం. రానున్న మూడేళ్లలో రుణాలను సున్నాకు తగ్గిస్తాం. దీనికి అనుగుణమైన చర్యలను కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని’ చంద్రశేఖరన్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరం(Financial year) నాటికి కంపెనీ నగదు ప్రవాహ సానుకూలతను సాధించేందుకు చర్యలు చేపడుతోందన్నారు.

వివిధ నాన్-కోర్ వ్యాపారాల్లో(non-core businesses) పెట్టుబడుల(Investments)కు టాటా మోటార్స్ గ్రూప్ సంస్థ ప్రయత్నిస్తోందని చంద్రశేఖరన్ అన్నారు. అలాగే, టాటా మోటార్స్ తన యూకే వెంచర్ జాగ్వార్(Jaguar) అండ్ ల్యాండ్ రోవర్(Land Rover) అంశంలో కట్టుబడి ఉన్నామని ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. దేశీయంగా ఇటీవలి మోడల్ కార్లు నెక్సాన్(Nexan), ఆల్ట్రోజ్ (Altroz), హారియర్స్ (Harriers) సహా ఇతర మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. కొవిడ్-19 (Covid -19) వ్యాప్తి, లాక్‌డౌన్(Lockdown)వల్ల భారత్‌లోనూ, విదేశాల్లోనూ అమ్మకాలు ప్రతికూలంగా ఉన్నందున టాటా సన్స్ కంపెనీ(Tata Sons Company) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వరుస రెండో త్రైమాసిక నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed