టాటామోటార్స్ నుంచి అతిపెద్ద టిప్పర్ ట్రక్

by Harish |
టాటామోటార్స్ నుంచి అతిపెద్ద టిప్పర్ ట్రక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మార్కెట్లోకి దేశీయ దిగ్గజ తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) అతిపెద్ద టిప్పర్ ట్రక్కు(Tipper truck)ను తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. టాటా సిగ్నా 4825టీకే (Tata Signa 4825.TK)పేరుతో తెచ్చిన ఈ ట్రక్కు 47.5 టన్నుల బరువుతో దేశీయంగా లభిస్తున్న మల్టీ యాక్సెల్ వాహనాల్లోనే( multi axle vehicles) అతిపెద్దదని కంపెనీ వెల్లడించింది. ఈ వాహనం 16 చక్రాలను కలిగి ఉంటుందని, 29 క్యూబిక్ మీటర్ల లోడ్‌తో లభించడమే కాకుండా ఈ వాహనానికి హైడ్రాలిక్స్ (Hydraulics) కూడా ఉన్నాయని కంపెనీ వివరించింది.

ఈ వాహనాన్ని 6 సంవత్సరాలు లేదంటే 6 లక్షల కిలోమీటర్ల వారెంటీ ప్యాకేజీలో అందిస్తున్నట్టు టాటా మోటార్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆర్ టీ వాసన్ తెలిపారు. ఈ టిప్పర్ ట్రక్కు ప్రధానంగా నిర్మాణ, బొగ్గు గనుల రంగంలోని వారికి అనువుగా ఉండేలా, వారి అవసరాలకు అనుగుణమైన రీతిలో తీసుకొచ్చామని, ఈ వాహనం బరువు 47.5 టన్నులు ఉంటుందని వాసన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు అవసరాలకు తగినట్టుగా ఈ వాహనాన్ని రూపొందించామన్నారు. ఇక, ఈ ట్రక్కు 250 బీహెచ్‌పీ (250 bhp) శక్తిని విడుదల చేసే 6.7 లీటర్ బీఎస్6 ఇంజిన్ (BS6 engine) అమర్చినట్టు కంపెనీ వెల్లడించింది. మార్కెట్లో ఈ ట్రక్కు 10ఎక్స్2, 10ఎక్స్4 మోడళ్లలో లభిస్తుందని, లైట్, మీడియ, హెవీ డ్రై మోడ్‌లలో కూడా ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది.

Advertisement

Next Story