- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3000 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ!
X
దిశ, వెబ్‌డెస్క్:
2019 సంవత్సరం చివరలో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన కార్చిచ్చు 2020 పూర్తికావస్తున్నప్పటికీ ఎంతోకొంత రగులుతూనే ఉంది. ఈ కార్చిచ్చు వల్ల పెద్ద ఎత్తున జంతువులు అగ్నికి ఆహుతి అయ్యి అంతరించిపోయాయి. ఇప్పుడిప్పుడే అక్కడి చెట్లు చిగురించి మళ్లీ కొత్త పొదలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఆ పొదల్లో తిరగడానికి జంతువులు లేవు. ఈ సమస్య నుంచి బయటపడేయడానికి ఆస్సీ ఆర్క్ అనే జంతు సంరక్షణ సంస్థ ముందుకొచ్చింది. గత దశాబ్ధకాలంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ వారి రెడ్ లిస్ట్‌లో ఉన్న అంతరిస్తున్న జాతుల జంతువులను ఆ సంస్థ కాపాడుతూ వస్తూ.. వాటిని ఇన్సూరెన్స్ పాపులేషన్‌గా బతికిస్తోంది. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ పాపులేషన్‌లోని కొన్ని జంతువులను ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో విడుదల చేసింది. ఆ జంతువుల్లో 3000 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం నుంచి అంతరించిపోయిన టాస్మేనియన్ డెవిల్ అనే జీవి కూడా ఉంది.
పెద్ద సైజు పందికొక్కులా ఉండే ఈ నిషాచర జీవి ఒకప్పుడు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో విరివిగా కనిపించేది. ఒకప్పుడు అంటే దాదాపు 4వేల ఏళ్ల క్రితం. కానీ అప్పట్లో ఇక్కడ నివసించేవారు నక్కలను, కుక్కలను, పిల్లులను వేట కోసం బాగా పెంచేవారు. వాటి సంఖ్య పెరగడంతో అవి ఆహారంగా తీసుకునే ఈ టాస్మేనియన్ డెవిల్ జాతి అంతరించిపోయింది. తర్వాత ఇవి అంతరించే స్థాయికి చేరుకుని కేవలం టాస్మేనియా ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కేన్సర్ కారణంగా ఈ జాతి దాదాపుగా 90 శాతం నశించిపోయింది. ఆ మిగిలి ఉన్న పది శాతం ఇప్పుడు టాస్మేనియాలో ఉన్నాయి. ఇప్పుడు 11 టాస్మేనియన్ డెవిల్స్‌తో పాటు మరో ఆరు వేరే క్షీరద జంతువులను ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో విడుదల చేసినట్లు ఆస్సీ ఆర్క్ సంస్థ పేర్కొంది.
Advertisement
Next Story