టార్గెట్ ఈటల.. జమునా హ్యచరీస్ పై మరోసారి విచారణ

by Shyam |   ( Updated:2021-11-08 05:04:38.0  )
టార్గెట్ ఈటల.. జమునా హ్యచరీస్ పై మరోసారి విచారణ
X

దిశ, మెదక్ : మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య ఫౌల్డ్రీ ఫామ్(జమునా హ్యచరీస్) మెదక్ జిల్లా మాసాయి పేట్ మండలం అచ్చం పేట్ గ్రామంలో ఉన్న అసైన్డ్ భూములపై తిరిగి ఈ నెల 16,17,18వ తేదీల్లో విచారణ జరుపుతామని కలెక్టర్ హరీశ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో విచారణ నిలిపివేశామని కలెక్టర్ గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా లేదని అందుకే తిరిగి అసైన్డ్ భూములపై డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ నెల 16, 17, 18 తేదీలలో విచారణ జరపనున్నట్లు కలెక్టర్ వివరించారు.

154 మంది రైతులకు నోటీసులు..

అచ్చంపేట అసైన్డ్ భూములకు సంబంధించి 154 మంది రైతులతో పాటు జమునా హ్యచరీస్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే‌గా గెలిచిన తరువాత ఆయన భార్య జమునా, కుమారుడు నితిన్ రెడ్డికి సంబంధించిన భూములపై ఐదు నుంచి ఆరు రోజులలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే, ఇదంతా సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా ఈటలను జైలుకు పంపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed