రాజమౌళికి తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..

by Shyam |
రాజమౌళికి తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: తారక్‌తో సినిమా చేయాలని నా హృదయం.. అభిమానులు ఆనందంతో చేసే అరుపులు, గోలల కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. జూనియర్‌తో సినిమా చేస్తే చాలా ఎంజాయ్ చేస్తాను. నేను రాసుకున్న సీన్లకు మ్యాగ్జిమమ్ న్యాయం చేయగలిగేది తారకే.. అందుకే ప్రతీ సినిమా చేసేటప్పుడు నిర్మాతకు ఎలా లాభం వస్తుందని ఆలోచిస్తే.. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే మాత్రం తన కెరియర్‌కు ఎలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తానని చెప్తుంటాడు దర్శకధీరుడు రాజమౌళి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ.. ఇలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

కానీ అంతకన్నా ముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కోసం వెయిటింగ్ ఇక్కడ అంటున్నారు. అయితే భీమ్ ఫర్ రామరాజు పేరుతో చెర్రీకి తారక్ బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వగా.. అదే స్టైల్‌లో ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో చెర్రీ చేతుల మీదుగా తారక్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదలకు ప్లాన్ చేశాడు జక్కన్న. అక్టోబర్ 22న డేట్ ఫిక్స్ చేశాడు కూడా. కానీ ఇప్పటి వరకు తారక్ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ తారక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచే విడుదలయ్యాయని.. ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్ విషయంలోనూ అదే సెంటిమెంట్ ఫాలో కావాలని జక్కన్నకు రిక్వెస్ట్‌తో కూడిన డిమాండ్ చేస్తున్నారు. కొమురంభీమ్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్‌తో ఈ రిక్వెస్ట్‌ను ట్రెండ్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.. ఫస్ట్ లుక్‌‌ను తారక్ చేతుల మీదుగా, టీజర్‌ చెర్రీ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story