"బద్లా" డైరెక్టర్ తో తాప్సీ ఫోటో స్టోరీ

by Jakkula Samataha |
బద్లా డైరెక్టర్ తో తాప్సీ ఫోటో స్టోరీ
X

తాప్సీ పన్ను… బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన భామ… ఆ తర్వాత సెలెక్టెడ్ మూవీస్ తో బాలీవుడ్ లో కూడా స్పెషల్ అనిపించుకుంది. రీసెంట్ గా థప్పడ్ సినిమాతో హిట్ అందుకున్న భామ… లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది. దీంతో ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గర అయ్యేందుకు ట్రై చేస్తుంది. రోజుకో ఫోటో షేర్ చేస్తూ.. ఆ పిక్ స్టోరీలో భాగంగా ఇంట్రస్టింగ్ విషయాలను తెలుపుతుంది.

View this post on Instagram

A day before we kick started the shoot of Badla in Glasgow. Just like this picture one can never guess who is directing who, who is the one talking n who is listening. But one thing is for sure the 2 ppl here love to have a conversation n that can range from the hair issues of this man to food issues of the woman. 5 years back when we met each other for the first time we never knew that THIS will be the film we will end up working on together but now that we have, we surely know there will be many more times we shall surprise each other not just with films together but with more useless topics of never ending conversations. Keeping the madness alive ❤️ #Throwback #Archive #QuarantinePost

A post shared by Taapsee Pannu (@taapsee) on

ఈ క్రమంలో దర్శకుడు సుజోయ్ ఘోష్ తో తనకున్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్తూ పోస్ట్ పెట్టింది. బద్లా మూవీ షూటింగ్ ప్రారంభానికి ముందు రోజు గ్లాస్గో లో తనతో దిగిన ఫోటోను షేర్ చేసిన తాప్సీ… ఈ పిక్ చూస్తుంటే ఎవరిని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కదా అని తెలిపింది. ఎవరు చెప్తున్నారు? ఎవరు వింటున్నారు? అనేది తెలియట్లేదు కదా అంది. కానీ ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ… ఆ అబ్బాయి తెల్లజుట్టు సమస్యల నుంచి స్త్రీల ఆహారం వరకి అన్నిటి గురించి చర్చించుకుంటారు అని తెలిపింది. ఐదేళ్ల క్రితం సుజొయ్ ను కలిసినప్పుడు ఇద్దరం కలిసి ఒక సినిమా తీస్తామని ఎప్పుడూ ఊహించలేదని చెప్పింది. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది.. మేము ఇద్దరం కేవలం సినిమా విషయంలో మాత్రమే కాదు చాలా విషయాల్లో ఒకరికి ఒకరం సర్ప్రైజ్ చేసుకోగలం అని అభిప్రాయపడింది.

Tags : Tapsee Pannu, Sujoy Ghosh, Badla, Bollywood

Advertisement

Next Story