‘బీజేపీలో చేరేందుకు ఈటలకు మనసెలా వచ్చింది’

by Shyam |
‘బీజేపీలో చేరేందుకు ఈటలకు మనసెలా వచ్చింది’
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈటల బీజేపీ కండువా కప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అని తమ్మినేని వీరభద్రం అభివర్ణించారు. వామపక్ష పార్టీలపై రాజేందర్ వ్యాఖ్యలు సరికాదని తమ్మినేని మండిపడ్డారు. దేశంలో కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని.. బీజేపీ మతోన్మాదాన్ని పెంచుతూ హింసను ప్రేరేపిస్తుందన్నారు. అలాంటి పార్టీలో చేరేందుకు ఈటలకు మనసెలా వచ్చిందని తమ్మినేని ప్రశ్నించారు. కేవలం ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story