- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెక్ బౌన్స్ కేసు… రాధికా, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష
దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ కపుల్ శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ కి కోర్టు లో చుక్కెదురైంది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ ఘటన తో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. గతంలో శరత్ కుమార్, రాధికా దంపతులు మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఒక భారీ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేసిన వీరు రేడియంట్ అనే మీడియా సంస్థ వద్ద నుండి రూ. 1.5 కోట్లను అప్పుగా తీసుకున్నారు. ఈ సినిమాను విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ లతో చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూడడంతో సదురు సంస్థ తమ డబ్బును తిరిగి చెల్లించవల్సిందిగా కోరింది.
2015 లో అప్పు చెల్లిస్తామని అగ్రిమెంట్ రాసుకున్న శరత్ కుమార్, రాధికా ఇప్పటివరకు అప్పును చెల్లించలేదని తెలిపింది. మధ్యలో చెక్ ఇచ్చారని , కానీ ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో వారిపై కోర్ట్ లో ఫిర్యాదు చేసినట్లు సదురు సంస్థ తెలిపింది. ఈ కేసు పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు రాధికా, శరత్ కుమార్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.