- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీతో మాట్లాడుకొని డ్రగ్స్ కేసు నీరుగార్చుతున్నారు: ఉత్తమ్
దిశ, వెబ్‌డెస్క్ : బెంగళూరు జరిగిన పార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నా.. సీఎం కేసీఆర్ వాళ్లను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక బీజేపీ నాయకులతో మాట్లాడుకుని ఆ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పరువు పొతుందని సీఎం కేసును బయటకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పరువు తీసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని ఘాటు విమర్శలు చేసిన ఉత్తమ్.. మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్లు బహిరంగంగా వసూల్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డిని ఎందుకు భర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలనీ ఉత్తమ్ డిమాండ్ చేశారు. దళితులకు ఓ నీతి రెడ్డకు మరో నీతా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.