బ్రేకింగ్.. తాలిపేరు ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తివేత

by Sridhar Babu |   ( Updated:2023-05-19 08:28:07.0  )
బ్రేకింగ్.. తాలిపేరు ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తివేత
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు, ప్రాజెక్టుకి ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అటవీ ప్రాంత వాగువంకల నుంచి ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వస్తోంది.

దీంతో అప్రమత్తమైన అధికారులు 19 గేట్లు ఎత్తి 36,700 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.74 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో 73.10 మీటర్ల నీటిని నిల్వచేసి అదనపు నీటిని గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టులోకి ప్రస్తుతం 34,900 క్యూసెక్కుల నీరు వస్తోందని డీఈఈ తిరుపతి తెలిపారు. వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. తాలిపేరు డ్యామ్ నుంచి విడుదలయ్యే నీటి వలన తేగడ వద్ద తాలిపేరు వాగుపై ఉన్న లోలెవల్ వంతెన నీట మునిగింది.

Advertisement

Next Story