తాలిపేరు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

by Sridhar Babu |
తాలిపేరు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో వరద పెరిగింది. జోరువానల మూలంగా ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి‌ భారీగా వరద వస్తుండటంతో గురువారం ఉదయం ప్రాజెక్టు 10 గేట్లు 5 అడుగులు ఎత్తిపెట్టి 33,410 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఎగువన ఉన్న ఛత్తీస్‌గడ్ అటవీప్రాంత వాగు, వంకల నుంచి ప్రాజెక్టు రిజర్వాయర్ కి 29,378 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 74 మీటర్ల నీటి నిల్వగల రిజర్వాయర్‌లో 73.68 మీటర్ల నీరు నిల్వ చేస్తూ అదనపు నీటిని అవసరమైన మేరకు గేట్లు ఎత్తి దిగువకి విడుదల చేస్తున్నట్లు తాలిపేరు ప్రాజెక్టు డీఈఈ తిరుపతి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed