తాలిబన్లు కశ్మీర్‌ను జయించి పాక్‌కు అప్పగిస్తారట.

by vinod kumar |   ( Updated:2021-08-24 12:05:25.0  )
pakistan pm imran khan
X

దిశ వెబ్ డెస్క్: కుక్క తోక వంకర అందామంటే….అది వారి బుద్ధికి సరిపోదు. పోనీ వేరే ఏ జంతువుతో పోల్చుదామన్న అది చిన్న బోయి మమ్మల్ని ఆ పనికి మాలిన వారితో పోలుస్తారని బాధ పడుతాయయెమో? ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ నేతల బుద్ధి అలాగే ఉంది మరీ. త్వరలో తాలిబన్లు కశ్మీర్‌ను జయించి పాకిస్తాన్‌కు తిరిగి అప్పగిస్తారని పగటి కలలు కంటున్నారు అక్కడి నేతలు. తాజాగా అధికార ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ చెందిన నీలం లోయ నేత ఇర్షాద్ షేక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమని త్వరలో సాకారమవుతుందని అన్నారు.Taliban

ఆప్ఘాన్‌కు చెందిన నేతలు పదే పదే నేతలు చెప్పినట్లు, తాలిబన్ల వెనక పాకిస్తాన్ ఉందనే వ్యాఖ్యలు నిజమని మరోసారి బుుజువయ్యాయి. తాలిబన్లకు మద్ధతుగా ఇంతకు ముందే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోనేత సైతం ఇదే తరహ వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది. ఉగ్రవాదుల విషయంలో ఇప్పటికే చావుతప్పి కన్నులోట్టబోయిన పాకిస్తాన్‌ బుద్ధి మారలేదని మరోసారి తెలిసింది. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని పాక్ పగటి కలల కంటోంది.

Advertisement

Next Story