‘అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోండి’

by Shyam |
‘అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోండి’
X

దిశ ప్రతినిధి, మెదక్ : కరోనా బారినపడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం అంబులెన్స్ లు పని చేస్తాయని, కొవిడ్ రోగులు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) అందించిన మూడు అంబులెన్స్ లను ఆదివారం గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు మాట్లాడుతూ కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

కొవిడ్ బారినపడిన వారిని ఆదుకునేందుకు జగ్గారెడ్డి ముందుకు వచ్చి అంబులెన్స్‌లు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అంబులెన్స్ ఫ్రీ సర్వీస్ అని, ఫోన్ చేస్తే ఎక్కడి నుండి ఏ హాస్పిటల్ కైనా తీసుకువెళ్తుంది, మళ్ళీ హాస్పిటల్ నుండి ఇంటి వద్ద డ్రాప్ చేసి వస్తుందన్నారు. గాంధీ భవన్ హెల్ప్ డెస్క్ 040 – 24601254 కి కాల్ చేసిన వారికి ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, బొల్లు కిషన్, మెట్టు సాయి, నగేశ్, జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed