తాజ్‌మహల్, ఎర్రకోట ఓపెన్.. ఎప్పటినుంచంటే?

by Shamantha N |
తాజ్‌మహల్, ఎర్రకోట ఓపెన్.. ఎప్పటినుంచంటే?
X

న్యూఢిల్లీ: తాజ్‌మహల్, ఎర్రకోట సహా అన్ని చారిత్రక కట్టడాలు సోమవారం నుంచి తెరుచుకుంటాయని కేంద్రం ప్రకటించింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈ కట్టడాలు ఈ నెల 6న తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్ ప్రకటనతో సుమారు 3,400 కట్టడాలను మూసివేస్తున్నట్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే, లాక్‌డౌన్ ఎత్తేస్తున్న క్రమంలో అన్‌లాక్ 1లో భాగంగా సుమారు 820 ఆధ్యాత్మిక ప్రాంతాలను కేంద్ర తెరిచేందుకు అనుమతిచ్చింది. తాజాగా, జూలై 6వ తేదీ నుంచి అన్ని చారిత్రక కట్టడాలను తెరిచేందుకు నిర్ణయించినట్టు కేంద్ర టూరిజం, కల్చర్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed