- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లోనూ అడుగుపెట్టనున్న ప్రముఖ దిగ్గజ కంపెనీ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగానే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రానిక్ వాహనాలకు భారీగా ఆదరణ పెరుగుతోంది. అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం, పలు అంతర్జాతీయ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల తయారీ మోడళ్ల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, సంస్థ చైర్మన్ లీయూ యంగ్-వే మాట్లాడుతూ.. భారత్‌లో సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీని చేపట్టనున్నట్టు బుధవారం వెల్లడించారు. జర్మన్ ఆటో తయారీదారుల పరోక్ష సహకారంతో ఈ వాహనాల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కీలక పాత్ర వహించాలని లక్ష్యంగా ఉన్నామని, దీనికోసం అమెరికా స్టార్టప్ ఫిస్కర్ ఇంక్, థాయ్‌లాండ్‌కు చెందిన పీటీటీ పీసీఎల్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు లీయూ యంగ్-వే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌తోపాటు యూరప్, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో సైతం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని భావిస్తున్నామని, తమ మొదటి ప్రాధాన్యం యూరప్ ఉంటుందని, తర్వాతి ప్రాధాన్యత మాత్రం భారత్‌దేనని లీయూ స్పష్టం చేశారు. 2025-2027 మధ్య నాటికి ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 10 శాతం వాహనాలకు విడిభాగాలు, సేవలను అందించే లక్ష్యంతో ఉన్నామని ఆయన వెల్లడించారు.