- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
F-16 కొనుగోలుకు తైవాన్ గ్రీన్ సిగ్నల్!
దిశ, వెబ్‌డెస్క్ : పక్కలో బళ్లెంలా తయారైన చైనా వలన తైవాన్ కూడా తన ఆయుధ సామర్ధ్యాన్నిపెంచుకునేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా వాయుసేనను మరింత పటిష్టంగా చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. వాషింగ్టన్ -బీజింగ్‌ల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఎఫ్ -16 ఫైటర్ విమానాలను తైవాన్‌కు విక్రయించేందుకు అమెరికా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ యుద్ధ విమానాలను అమెరికాకు చెందిన రక్షణ, ఏరోస్పేస్, టెక్నాలజీ సంస్థ లాఖీడ్ మార్టిన్ కార్ప్ తయరు చేస్తోంది. 2019లో ఈ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఇరుదేశాల మధ్య అగ్రిమెంట్ కుదరగా.. 2026 చివరి నాటికి అమెరికా 90 ఎఫ్-16 ఫైటర్ జెట్లను తైవాన్‌కు అందజేయనుంది. అయితే 1992 నుంచే తైవాన్‌కు ఫైటర్ జెట్స్‌ను విక్రయించాలని అమెరికా భావిస్తున్నప్పటికీ.. చైనా నుంచి వ్యతిరేకత ఏర్పడటంతో సైలంట్‌గా ఉంది.
తమ సొంత భూభాగంగా భావించే తైవాన్‌కు ఆయుధాలను విక్రయించొద్దంటూ అమెరికాను డ్రాగన్ హెచ్చరిస్తూ వస్తోంది. కాగా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా చైనా హెచ్చరికలను లెక్కచేయకుండా.. ఎఫ్16 ఫైటర్ జెట్లను విక్రయించేందుకు సిద్ధపడింది.