భారత ప్రయాణీకులపై తైవాన్ నిషేదం

by Shamantha N |
భారత ప్రయాణీకులపై తైవాన్ నిషేదం
X

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తైవాన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. మంగళవారం ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలికంగా నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేదం సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుందన్నారు. కాగా భారత్ నుంచి తిరిగి వస్తున్న తైవాన్ పౌరులను దీని నుంచి మినహాయిస్తున్నట్టు తెలిపారు. అయితే వారు కరోనా టెస్టులు చేయించుకోవాలనీ… 14 రోజుల క్వారంటైన్ పాటించాలని వెల్లడించారు.

ఇజ్రాయెల్ కూడా అదే బాటలో..

కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు ప్రయాణాలను నిలిపివేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయిల్ పౌరులు భారత్‌కు వెళ్లడంపై తాత్కాలికంగా నిషేదం విధిస్తున్నట్టు పేర్కొంది. తమ పౌరులు కాకుండా ఎవరైనా భారత్‌కు వెళ్లి శాశ్వతంగా స్థిరపడతామంటే వారికి అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 16 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed