- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానవత్వం చాటిన తహశీల్దార్.. అంబులెన్స్ వద్దకే వచ్చి..
దిశ, చెన్నూర్: మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన చెకుర్తి రాజగోపాల రెడ్డి తన పేరుమీద ఉన్న భూమిని తన ఇద్దరు కుమారులకు గిఫ్ట్‌గా రిజిస్ట్రేషన్ చేయించడానికి బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కానీ అతను గత పదిహేను సంవత్సరాల నుండి వెన్నుపూస నొప్పి కారణంగా మంచానికి పరిమితమై ఆచేతన స్థితిలో అంబులెన్స్‌లో తహశీల్దార్ కార్యాలయానికి తీసుకు వచ్చారు. స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే పట్టేదారు పరిస్థితి గమనించి తన ధరణి ఆపరేటర్ వినోద్‌తో కలిసి తన లాప్ టాప్‌తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. అన్ని ప్రక్రియలు సానుకూలంగా ఉన్నప్పటికీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పనులు కానీ నేటి తరుణంలో తహశీల్దార్ సానుకూలంగా స్పందించి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినందుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.