రేవంత్ రెడ్డిని సీఎం చేస్తాం.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2021-10-21 09:19:39.0  )
రేవంత్ రెడ్డిని సీఎం చేస్తాం.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, బయ్యారం: రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తమవంతు కృషి చేస్తామని మహబూబాబాద్‌ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రాధాబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రేల ఆగిరెడ్డి ఇంటి వద్ద.. మండల మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధాబాయి మాట్లాడుతూ.. సంస్థాగతంగా మండల కమిటీలను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోనికి తేవడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరినీ కలుపుకొని మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బయ్యారం మండల మహిళా అధ్యక్షురాలిగా తగిరా నిర్మలారెడ్డికి ఆమె చేతుల మీదుగా నియామక పత్రం అందచేశారు.

నా వంతు కృషి చేస్తా..

ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షురాలు తగిరా నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. ‘జిల్లా అధ్యక్షురాలి ఆదేశానుసారంగా పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తా.. నాకు ఈ పదవి రావడంలో చొరవ తీసుకున్న జిల్లా కమిటీ, మండల కమిటీల నాయకులు, జిల్లా మహిళా అధ్యక్షురాలికి ధన్యవాదాలు’. -తగిరా నిర్మలారెడ్డి, బయ్యారం మండల నూతన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, తగిర ఉపేందర్ రెడ్డి, గార్ల మండల నాయకులు జలీల్, రాజు, మోహన్ నాయక్, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story