- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు.. తగ్గుతానన్న జేసీ
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. 71 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలలో వైసీపీ ఘన విజయం సాధించింది. తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రి మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా టీడీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ 14 చోట్ల, సీపీఐ ఒకచోట, ఇండిపెండెంట్ అభ్యర్థి మరోచోట గెలుపొందారు. అయితే తాడిపత్రి మున్సిపాలిటీపై అటు టీడీపీ ఇటు వైసీపీ కన్నేశాయి.
దీంతో అప్రమత్తమైన జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ కూర్చీలో తానే కూర్చుంటానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ నుంచి నలుగురు కౌన్సిలర్లు తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే తాడిపత్రిపై ప్రేమతోనే వాళ్లు తమను గెలిపించుకున్నారన్నారు. ప్రజలకు తానే ధైర్యమని.. తనను చూసే గెలిపించారన్నారు. జేసీని నమ్మారన్నారు.
ఈ గెలుపు తాడిపత్రి ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. పదిరోజుల తర్వాత మున్సిపల్ ఆఫీసులో కూర్చుని.. ప్రతి విషయంలో అందరినీ కలుపుకుపోతానని, ఎమ్మెల్యేను సైతం కలుపుకుని పోతామన్నారు. తనకు ఏదీ అవసరం లేదని, 365 రోజులు.. 24 గంటలు ప్రజల కోసం పని చేస్తానన్నారు. తాడిపత్రి ప్రజల కోసం ఎంత తగ్గాలో అంత తగ్గి పని చేస్తానని అన్నారు. సేవ్ తాడిపత్రి అనే పదం ప్రజల్లో నుంచే వచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.