చంద్రబాబు రుజువు చూపించు: శ్రీదేవి

by srinivas |
చంద్రబాబు రుజువు చూపించు: శ్రీదేవి
X

దిశ ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చొప్పున చనిపోతున్నారంటున్న చంద్రబాబు.. దానికి రుజువులు చూపించాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, చంద్రబాబుకు మైండు సరిగా పనిచేయడం లేదని అందుకే రోజూ చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కరువు, చంద్రబాబు కవల పిల్లలన్న ఆమె, రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడడం చూసి బాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తన ఇంద్రభవనంలో కూర్చొని ఎల్లో మీడియా ద్వారా రోజు విషం కక్కుతున్న బాబు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని తేలిందని ఆమె తేల్చేశారు.

Advertisement

Next Story