‘దిశ’ఆనాడే చెప్పింది

by Sridhar Babu |   ( Updated:2020-04-04 22:38:51.0  )
‘దిశ’ఆనాడే చెప్పింది
X

దిశ, కరీంనగర్
కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా మత ప్రచారకులకు కరోనా పాజిటివ్ రావడంతో అసలు వారెవరు.. వారెందుకు వచ్చారు అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు ‘తబ్లిఘీ జమాతే’ అనే సంస్థ పేరిట దేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి ప్రచారం చేస్తున్నారని ‘దిశ’ మార్చి 18నే ప్రచురించింది. మార్చి 16న వీరిలో కరోనా లక్షణాలు ఉన్నాయని హైదరాబాద్ గాంధీకి కరీంనగర్ జిల్లా అధికారులు తరలించారు. 17న ఇండోనేషియా మత ప్రచారకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో వీరి పర్యటన లొగుట్టును విప్పింది ‘దిశ’. ‘కరోనా బాధితుల పర్యటన.. అధికారుల అప్రమత్తం’ అన్న శీర్షికతో వచ్చిన వార్తలో వీరంతా తబ్లిఘీ జమాతే సభ్యులేనని వీరు మత ప్రచారం కోసం రాష్ట్రంలోకి వచ్చారని వెలుగులోకి తెచ్చింది. మొదట వీరు ఇండోనేషియా నుంచి వచ్చారని వచ్చేప్పుడే వీరు కరోనాను మోసుకొచ్చారని అనుకున్నారంతా. కానీ ఆ తరువాత మర్కజ్ ప్రార్థనలు వెలుగులోకి రావడం అక్కడకు వెళ్లిన వారికి కూడా కరోనా సోకడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీసి తబ్లిఘీ జమాతే గురించి చెప్పాయి. కానీ అప్పటికే ‘దిశ’ ఈ సంస్థ కార్యకలాపాలను వెలుగులోకి తీసుకరావడం గమనార్హం.

Tags: disha, Tablighi Jamaat, Prayers, Karimnagar, Muslims, coronavirus, Covid-19, Telangana

Advertisement

Next Story

Most Viewed