- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేడీ ఓరియంటెడ్ సినిమాల బడ్జెట్.. హీరో రెమ్యునరేషన్‌తో సమానం
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.. సినీ ఇండస్ట్రీలోని జెండర్ ఈక్వాలిటీస్ గురించి ఓపెన్ అయింది. ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రష్మి రాకెట్’ చేస్తున్న తాప్సీ.. ఈ మూవీ కోసం అథ్లెటిక్ బాడీని పొందాలనే సవాల్, తనను చాలా కష్టపడేలా చేసిందని చెప్పింది. ఇందులో స్ప్రింటర్ పాత్రలో కనిపించనున్న పింక్ బ్యూటీ.. బాగ్ మిల్కా బాగ్ సినిమా కూడా ఇదే జోనర్‌లో వచ్చిందని తెలిపింది.
కానీ ‘రష్మి రాకెట్’ లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అంతగా బడ్జెట్ ఉండదని, అందుకే మనం వీఎఫ్ఎక్స్‌పై ఆధారపడకుండా రియల్‌గా వర్కౌట్ చేసి రియాలిటీలోనే ఫిట్‌నెస్ చూపించాల్సి ఉంటుందని, ఇందుకోసం ఖచ్చితంగా వర్కౌట్ చేయాలని తెలిపింది. మేల్ డ్రివెన్ సినిమాలకైతే భారీ బడ్జెట్ ఉంటుందని, అదే ఫిమేల్ డ్రివెన్ సినిమాల బడ్జెట్ చూస్తే హీరో రెమ్యునరేషన్‌కు దగ్గరగా ఉంటుందని తెలిపింది. అందుకే ఏడాది పాటు హీరోలు ఒకే సినిమాకు స్టిక్ అవుతారని.. కానీ హీరోయిన్ల విషయానికొస్తే అలా ఉండదని చెప్పింది. చిన్న రెమ్యునరేషన్‌తో ఒకే సినిమాను ఏడాదిపాటు చేస్తే దాదాపు ఐదు సినిమాలు కోల్పోవాల్సి వస్తుందని.. ఇది ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాదని తెలిపింది తాప్సీ. తాను ఇప్పుడు పొందుతున్న క్యారెక్టర్లు కూడా అలాంటివేనని.. అందుకే తప్పక నో చెప్పాల్సి వస్తోందని వెల్లడించింది.