టీ20 వరల్డ్ కప్‌‌లో ఉత్కంఠ రేపుతున్న అర్హత మ్యాచ్‌లు

by Shyam |
ICC T20 World Cup
X

దిశ, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్ సమరానికి అన్ని దేశాలు తమదైన శైలిలో వ్యూహాలు రచించుకుంటున్నాయి. మొత్తం 16 జట్లు ఉన్నప్పటికీ ఇందులో అధికారికంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. మిగతా 8 జట్లలో కేవలం 4 జట్లు మాత్రమే సూపర్ 12కి అర్హత సాధించనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి ప్రారంభమైన అర్హత మ్యాచ్‌లు సైతం నువ్వా-నేనా అన్న రీతిలో సాగుతున్నాయి. అర్హత సాధించని 8 జట్లని గ్రూప్ A, గ్రూప్ Bలుగా విభంజించారు. ప్రతి గ్రూప్ నుంచి కేవలం రెండు జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. గ్రూప్ Aలో శ్రీలంక, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్ జట్లు వున్నాయి.

ఇదే గ్రూప్‌లో ఇప్పటికే శ్రీలంకకి ఒక మ్యాచ్ మిగిలివుండగానే ఈ జట్టు అర్హత దాదాపు ఖరారైంది. శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లో కూడా విజయం సాధించి పటిష్టంగా కనిపిస్తుంది. నెదర్లాండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి దాదాపు ఇంటిదారి పట్టనుంది. ఇక మిగతా ఒక్క స్థానం కోసం ఐర్లాండ్, నమీబియా పోటీపడుతున్నాయి. ఈ జట్లు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్కో విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ జట్లకు ఇక ఒకటే మ్యాచ్ మిగిలివుండడంతో టగ్ ఆఫ్ వార్ అన్నరీతిలో ఆడనున్నాయి. రన్ రేట్‌తో సంబంధం లేకుండా కేవలం విజయం సాధించిన జట్టే నేరుగా సూపర్ 12కి అర్హత సాధించనుంది. దీంతో తుది మ్యాచ్ పై ఇంకా ఆసక్తి పెరిగింది. మొత్తానికైతే ఈసారి అర్హత మ్యాచ్‌‌లు మినీ ప్రపంచకప్‌ను తలపిస్తున్నాయి అని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed