బిగ్ బ్రేకింగ్.. సన్‌రైజర్స్ ప్లేయర్‌కు కరోనా.. IPL మరోసారి వాయిదా.?

by Anukaran |   ( Updated:2021-09-22 04:44:07.0  )
బిగ్ బ్రేకింగ్.. సన్‌రైజర్స్ ప్లేయర్‌కు కరోనా.. IPL మరోసారి వాయిదా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ సెంకడ్ హాఫ్‌లో బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ కరోనా బారినపడ్డారు. కరోనా టెస్టుల్లో అతడికి పాజిటివ్‌గా తేలింది.

ఈ క్రమంలో నటరాజన్‌తో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు ఆటగాళ్లు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. వారిలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, విజయ్ కుమార్ (టీమ్ మేనేజర్), శ్యామ్ సుందర్(ఫిజియోథెరపిస్ట్),
అంజనా వన్నన్(డాక్టర్), తుషార్ ఖేడ్కర్(లాజిస్టిక్స్ మేనేజర్), పెరియసామి గణేషన్( నెట్ బౌలర్) ఉన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ఐపీఎల్ మొదటి హాఫ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story