- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. స్విగ్గీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ తరఫున పని చేస్తూ కస్టమర్లకు నిరంతరాయంగా ఫుడ్ డెలివరీ చేస్తున్నవారందరికీ కరోనావ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని ఆ సంస్థ తెలిపింది. సుమారు 2 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్స్ (డెలివరీ బాయ్స్, గర్ల్స్‌ను స్విగ్గీలో ఇలాగే పిలుస్తారు) కు టీకా అందించనున్నామని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందించబోతున్న నేపథ్యంలో స్విగ్గీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఇదే విషయమై స్విగ్గీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) వివేక్ సుందర్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ సంస్థలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా పనిచేస్తున్నవారంతా ప్రజల ఆహార అవసరాలను తీర్చారని కొనియాడారు. వారే తమ సంస్థకు వెన్నెముక లాంటి వారనీ, డెలివరీ పార్ట్‌నర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు.
From essentials to food, delivery partners have always been our lifelines.
We're happy to announce that we're supporting 100% of the vaccination cost for our entire delivery fleet, and that this entire drive will be facilitated by us to keep them and you safe. #DeliveringHope
— Swiggy (@swiggy_in) March 24, 2021
మొదటి దశలో భాగంగా 5,500 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు టీకా అందించనున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. మొత్తంగా 2 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని స్విగ్గీ పేర్కొంది.