- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చక్కెర పొంగలి..!
ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో పిండి వంట ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. తీపి అంటే గుర్తొచ్చేది చక్కెర పొంగలి. బియ్యంలో పాలు పోసి కాసింత బెల్లం కలగలిస్తే రుచులూ పొంగుతాయి. చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాలసిన పదార్దాలు: బియ్యం -1 కప్పు, పెసరపప్పు -1/2 కప్పు, బెల్లం – 1/2 కప్పు, నీళ్లు -4 గ్లాసులు, నెయ్యి -1/4కప్పు, జీడిపప్పు-10, కిస్మిస్-8, కొబ్బరి ముక్కలు-6, యాలకుల పొడి-1/4 టీస్పూన్, పచ్చ కర్పూరం పొడి -చిటికెడు, జాజికాయ పొడి -చిటికెడు,
తయారీ విధానం: స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి పెసర పప్పును దోరగా వేయించుకోవాలి. దీనిలో బియ్యం కలిపి కుక్కర్ లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక ప్యాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకున్నట్లయితే పానకం తయారైనట్టు. ఈ పానకంలో ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలిపి చిన్న మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి. వీటిలో యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి, జాజికాయ పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఒకసారి కలిపితే చక్కెర పొంగలి రెడీ..